మీరు ఈ పదవికి అర్హులు ఖుష్బూ.. చిరంజీవి ట్వీట్

  • జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి
  • సమస్యలపై సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్
  • మహిళల గొంతుక మరింత శక్తిమంతంగా మారుతుందని వ్యాఖ్య
సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూకు కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఖుష్భూపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. మీరు కచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ.. సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీ వల్ల మహిళల గొంతుక మరింత శక్తిమంతంగా మారుతుంది” అంటూ చిరు పేర్కొన్నారు.

ఖుష్భూను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలీనా ఖోంగ్‌డుప్‌ కూడా నామినేట్ అయ్యారు. వారి పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఖుష్బూ ధన్యవాదాలు తెలిపారు.

Chiranjeevi
kushboo sundar
National Commission for Women
kushboo nominated as ncw member

More Telugu News